వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభించారన్నారు. కొండా సురేఖను జగన్ పట్టించుకోలేదని.. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక స్థానం జగన్ కే సొంతం అని విమర్శించారు.. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను తణుకు అరెస్టు చేశారు. తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మెషీన్లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, బీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీవో కాలనీకు చెందిన…
ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు.
జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని... గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు.
ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
ఈ నెల 5 న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.