War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య “వార్”.. ఇది ముగింపు కాదంటూ తారక్ ట్వీట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War 2 : జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోలు సరదాగా గొడవ పడుతూ చేస్తున్న వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇంటికి ఓ పోస్టర్‌తో కూడిన వాహనాన్ని పంపిన విషయం తెలిసిందే. దానికి బదులుగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్‌కి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఓ పోస్టర్‌తో కూడిన వాహనాన్ని ఎన్టీఆర్ ఇంటికి పంపించాడు. దీనిపై స్పందించిన తారక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బాల్కనీలో నిలబడిన ఫొటోను షేర్ చేస్తూ.. “మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు హృతిక్ సార్.. కానీ ఇది ముగింపు కాదు! ఆగస్టు 14న యుద్ధం నిజంగా ప్రారంభమవుతుంది. అప్పుడు కలుద్దాం.” అంటూ రాసుకొచ్చారు. ఎన్టీఆర్ పంపిన వాహనం బిల్ బోర్డుపై..”ఘుంగ్‌రూ టూట్ జాయేంగే పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పాయోగే” (మీ కాళ్లు నొప్పి పెట్టినా కూడా మీరు మాతో జరిగే యుద్ధంలో గెలవలేరు )అని రాసి ఉంది. అయితే.. హృతిక్ పంపిన వాహనంపై Naatu Naatu As Much Has You Want But I am Winning This War( నాటు నాటు పాటలో మాదిరిగా ఎంతైనా ఎగురు.. కానీ ఈ “వార్”లో గెలిచేది మాత్రం నేనే) అని రాశారు.
Nice return gift @iHrithik sir…But this is not the end! The War begins for real on 14th August. See you then! 😎#8DaysToWar2 pic.twitter.com/3P8kD2rrwy
— Jr NTR (@tarak9999) August 6, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!