KTR Slams Revanth Reddy: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలన వచ్చాక ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్తితి ఆగమాగం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అడిగితే తాము బీఆర్‌ఎస్ లోనే ఉన్నాం.. అది దేవుని కండువా అంటున్నారన్నారు.. సీఎం ఎలా ఉండాలో నాయకత్వం ఎలా ఉండాలో చూపెట్టింది కేసీఆర్.. ఎలాంటి పనులు, ఎలాంటి భాష మాట్లాడొద్దు, ఎలా ఉండొద్దో చెప్పింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఢిల్లీ వెళ్తే తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు.. అప్పు పుడుతా లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెమ్మదిగా అమలు చేయాలని.. 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికి అమలు చేయటం లేదన్నారు. తనను కోసుకొని తిన్న అప్పు పుడుతా లేదు అని ఒక ముఖ్యమంత్రి అనొచ్చా? అని ప్రశ్నించారు. మొన్న రేషన్ కార్డుల పంపిణీలో మా అక్క సబితా ఇంద్రారెడ్డిని అవమానించారన్నారు. ఓడి పోయిన వ్యక్తులు స్టేజి మీద కూర్చుంటున్నారన్నారు.
READ MORE: Trump Tariffs: రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..!
ధైర్యంగా ఎదుర్కొంది మా సబితా అక్క.. హోమ్ మంత్రిగా పని చేసిన వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారని కేటీఆర్ తెలిపారు. మళ్ళీ తమ అధికారం వచ్చాక ఎవర్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. “మొన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు అని అబద్ధాలు చెప్పవచ్చా. రెండు ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. బరాబర్ వారిపై చర్యలు తీసుకుంటాం. వారి పేర్లు అన్ని రాసిపెట్టుకుంటున్నాం. వికారాబాద్ కలెక్టరేట్ మీ దగ్గర చేశాం. ప్రతి రంగాన్ని పదేళ్లలో అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేసిన అనేక విషయాలు మేము చెప్పుకోలేకపోయాం. పెళ్లి పెట్టుకున్న రోజే తులం బంగారం ఇస్తామన్నారు. ఇవ్వలేదు.. ఈ దుర్మార్గ పాలన తెలంగాణ మళ్ళీ 100 యేళ్లు వెనక్కి పోతుంది.. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నం అని బాధ పడుతున్నారు. రైతుల పరిస్తితి ఆగం అయ్యింది. ఆనాటి రోజులు అన్నాడు అవే రోజులు మళ్ళీ తెచ్చిండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు. ఒక్క సంవత్సరం కడుపు గట్టుకుంటే.. రుణమాఫీ అన్నాడు. చెప్పిన లెక్కలకు ఇచ్చిన లెక్కలకు పొంతన లేదు. దమ్మున్న నాయకుడు అయితే బీసీ రిజర్వేషన్లు సాధించుకొని వస్తా అని చెప్పాలి. కేసిఆర్ నాడు ఢిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొని వస్తా అని చెప్పి కేంద్రం మెడలు వంచి తెచ్చారు.కానీ ఢిల్లీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చి వస్తున్నారు. ఈ పనికి అక్కడికి వెళ్ళటం ఎందుకు.. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. రాహుల్ గాందీ ప్రధాని అయితేనే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారా ఆనాడు. ఓట్లేయండి అన్నారు..ఇప్పుడు మాట మారుస్తున్నారు. 20 నెలల నుంచి కేసిఆర్ ఆరోగ్యం దృష్ట్యా ఇంట్లో ఉన్నాడు. సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఈ 20 నెలల్లో రోజు కేసిఆర్ పేరు తలవకుండ ఉండరు. ఇంట్లో కూడా నిద్రలో కేసీఆర్ పేరే తలుస్తున్నారేమో.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Trump Tariffs: రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..!