Putin to Visit India: అమెరికాతో ఉద్రిక్తత మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తారని, ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం మాస్కో పర్యటన సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనపై భారత్ ఎంతో ఉత్సాహం, ఆనందంగా ఉందని అజిత్ పేర్కొన్నారు. గత భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశాలను ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు క్షణాలుగా ఆయన అభివర్ణించారు. రాబోయే సమావేశం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆగస్టు చివరిలో అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తారని అజిత్ దోవల్ చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ గతంలో ఉటంకించింది. అయితే.. తరువాత వార్తలను సవరించి, అధ్యక్షుడు పుతిన్ 2025 చివరిలో భారత్‌ను సందర్శిస్తారని ఏజెన్సీ తెలిపింది. కాగా.. ట్రంప్ ఒత్తిడి మధ్య మోడీ-పుతిన్ కొత్త వ్యూహం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై భారీ ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Trump’s South Asia Strategy: ట్రంప్ ప్లాన్ ఏంటి..? పాకిస్థాన్‌ను పావుగా మార్చుకున్నారా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్‌పై 25% సుంకం విధించారు. కొన్ని రోజుల తర్వాత.. రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి భారత్‌పై సుంకాలను పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేయడమే కాకుండా.. కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తోంది. రష్యా యుద్ధ యంత్రం ఉక్రెయిన్‌లో ఎంత మందిని చంపుతుందో భారత్ పట్టించుకోవడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్‌పై సుంకాన్ని పెంచబోతున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం భారత్‌పై అదనంగా 25% సుంకాన్ని ప్రకటించారు. దీంతోమొత్తం సుంకం 50% కి చేరుకుంది.
READ MORE: Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత