Jhansi honor killing: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఒక ప్రేమికుల హత్య కేసు సంచలనంగా మారింది. మూడు రోజుల్లోనే రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఆ ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
READ MORE: Hrithik Roshan: ఫస్ట్ సినిమాతోనే గిన్నిస్ రికార్డ్.. ఎవరా స్టార్.. ఏంటా కథ?
పోలీసుల కథనం ప్రకారం.. ఝాన్సీలోని గరౌత పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపుర గ్రామంలో 18 ఏళ్ల పుట్టో మృతదేహం గ్రామంలోని కొండపై అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం, ఝాన్సీ పరిధి లహ్చురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుధా గ్రామం నది ఒడ్డున రక్తంతో తడిసిన ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి పేరు విశాల్ అని వెల్లడైంది. అతను తహ్రౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పత్రాయ్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. విశాల్, పుట్టో చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం, ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఈ అంశంపై గరౌతా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బహుశా అమ్మాయి కుటుంబానికి వారి ప్రేమ వ్యవహారం నచ్చకపోవచ్చునని ప్రజలు అంటున్నారు. కాబట్టి వారు వారిని చంపి, వారి మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో విసిరేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి రెండు గ్రామాల్లోనూ దుఃఖ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ అంశంపై పోలీసులు స్పందిస్తూ.. ఆ అమ్మాయి సోదరుడు ఈ హత్యలు చేశాడని.. ప్రస్తుతం ఆ సోదరుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు.
READ MORE: Chatgpt Health Advice: కొంపముంచిన చాట్ జీపీటీ సలహా.. మీరు అలానే అడుగుతున్నారా?