ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొక్కిసలాటపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 11 మంది చనిపోయినట్లు సీఎం స్పష్ట చేశారు. మరో 33 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో […]
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. ప్రజలు తమ క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్షోను నిలిపివేసిందని స్పష్టం చేశారు. కానీ, స్టేడియం…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. "ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్సీబీ విజయాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ.. ముందస్తు…
ఆర్సీబీ ఆటగాళ్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారికి ఇంకా పరిస్థితి తెలియకపోవచ్చు. అయితే.. సంఘటనలు జరిగినప్పటికీ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. నినాదాలను ఆపివేయమని కోరాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులు పరుగులు తీయడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో భారీ జనసమూహం కారణంగా ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్-బస్ పరేడ్ రద్దు చేశారు. మైదానం బయట పరిస్థితి చాలా గందరగోళంగా…
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.
సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్థించే వారెవరయినా, పవన్ కళ్యాణ్ తో సహా శిక్షించాలి,అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.