వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీ పై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు.. చేప ప్రసాదం కోసం ఫిషరీస్ కార్పొరేషన్ 1.5 లక్షల చేప పిల్లలు సిద్ధం చేసింది.
అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు ధ్వంసమయ్యాయని ఆపరేషన్‌లో పాల్గొన్న వర్గాలు ఇండియా…
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
అమ్మా.... అనే పిలుపు కోసం తహతహలాడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం పెద్దహరిజనవాడలో జరిగిన ఘటన తలచుకుంటే ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనే అనుమానం కలగక మానదు. ఏప్రిల్ 28న గ్రామ శివారులోని గంగమ్మ గుడి దగ్గర ఉన్న గడ్డివాములో అప్పుడే పుట్టిన మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత ఐదేళ్లు ఫ్యాక్షన్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించారని.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరరాచక,విధ్వంస పూరిత పాలన సాగిందన్నారు. జగన్ ప్రభుత్వానికి జూన్ 4 న రాష్ట్ర ప్రజలు సమాధి చేశారని చెప్పారు. వైసీపీ వెన్నుపోటు దినం చేయటం కన్నా సంవత్సరీకం చేసుకోవాలని.. జగన్ లాంటి దౌర్భాగ్య పాలనను చూసి ప్రజలు గత యేడాది జూన్ 4 న పిండం పెట్టారన్నారు.
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.