పార్టీలోకి రాకముందు తనకు అనుమానాలు రేకెత్తించారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఆ సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ కోసం ఆర్కిటెక్ట్ గా పనిచేస్తానన్నారు. ఒక దళిత అంశం మీద మాట్లాడడానికి మాత్రమే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని పారిశ్రామిక వేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాత బీజేపీలో చేరానన్నారు. కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినందుకు క్షమించాలన్నారు. ఏ ఒక్కరితో చర్చించినా బీఆర్ఎస్ ప్లాన్ బీ క్యారెక్టర్ దెబ్బతీసే ప్లాన్ అమలు చేస్తుందని కార్యకర్తలకు చెప్పలేదన్నారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో జర్నీ ప్రారంభిస్తానన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో జనాల్లోకి తీసుకువెళ్ళడానికి తాను సిద్ధమన్నారు. 2009లో తాను బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీచేస్తే ఒక్క ఇన్‌ఛార్జి కూడా తన దగ్గరకు రాలేదన్నారు.
READ MORE: Mahavatar : ఇంట్లో కూర్చొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు – దర్శకుడు అశ్విన్ కుమార్
గువ్వల బాలరాజుకు అహంకారం ఎక్కువ కాబట్టి ఓడిపోయారు అన్నారని… మరి కేసీఆర్ ఎందుకు అధికారంలోకి రాకుండా పోయారని గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి దళితులు వేసిన భిక్ష అని తాము అనలేదన్నారు. కేటీఆర్ నాకంటే 6 నెలలు పెద్ద అంతే.. నన్ను బచ్చ అంటున్నారన్నారు. బీజేపీలో చేరుతుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ నేతలు తన చేరికపై చర్చించవద్దని కోరుతున్నా అన్నారు.
READ MORE: MLC Kavitha: కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే..