కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై మాట్లాడుతూ.. ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సింగరేణి.. సింగరేణిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడాలని కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణి లో ఎంతో బొగ్గు తవ్వాల్సి ఉంది.. మొత్తం 185 మైన్స్ చేయొచ్చు.. సంవత్సరానికి 5 మైన్స్ ఓపెన్ చేయాలన్నారు. సింగరేణి కార్మికుల మీద వేసిన టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి లో ఉన్న HMS సంఘం తో కలిసి తెలంగాణ జాగృతి పనిచేస్తుంది
READ MORE: Pulivendula Election: పులివెందులలో 550 మందిపై బైండోవర్ కేసులు.. భారీగా పోలీసుల బందోబస్తు..
“సింగరేణి , జాగృతి కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపు ఇస్తున్నాం. లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలి అనే డిమాండ్ తో పోరాటం చేస్తాం. కాంగ్రెసు ప్రభుత్వం సింగరేణి లోని మెడికల్ బోర్డ్ ను కరెప్షన్ బోర్డ్ గా తయారు చేశారు. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం లో నేను గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూనే ఉన్నాను. వాళ్ళను కూడా కలుపుకొని పోయి పోరాటాలు చేస్తాం.” అని కవిత వ్యాఖ్యానించారు.
READ MORE: AlluArjun : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ.. ఫ్యాన్స్ షాక్!