Health Benefits of Music: పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని క్లిష్టమైన రోగాలను సైతం నయం చేయగలిగే సత్తా సంగీతానికి ఉంటుంది. మరి సంగీతం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా..
READ MORE: AP Liquor Scam : ఎంపీ మిథున్ రెడ్డి సహా ఆ ముగ్గురికి బెయిల్
సంగీతంతో హైపోథలమస్, అమిగ్దల, హిప్పోక్యాంపస్ భాగాలతో కూడిన లింబిక్ వ్యవస్థ ఉత్తేజిత మైనప్పుడు భావోద్వేగాల ప్రతిస్పందన మెరుగవుతుంది. ప్రవర్తన, చురుకుదనం, జ్ఞాపకశక్తినీ ఈ వ్యవస్థే పర్యవేక్షిస్తుంది. మెదడులోని బూడిదరంగు పదార్థం (సెరిబ్రల్ కార్టెక్స్) ప్రేరేపితమైనప్పుడు డ్యాన్స్ చేసేలా పురికొల్పుతుంది. లయకు అనుగుణంగా శరీరం కదిలేలా చేస్తుంది.
READ MORE: Top Luxury Trains India: నిజంగా ఇవి రైళ్లు కాదు భయ్యా.. ఇండియాలో టాప్ 5 ట్రైన్స్ ఇవే..
పాటలు వినడం వల్ల జ్ఞాపకశక్తి భద్రంగా ఉంటుంది, మరింతగా మెరుగవుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఏకాగ్రత, జాగరూకత ఎక్కువవుతుంది. త్వరగా స్పందించటం అబ్బుతుంది. ప్రాదేశిక దృశ్యాల ఊహాత్మక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో, పెద్దల్లో మెదడు ఎదుగుదల ఇనుమడిస్తుంది. అంతే కాదు.. పాటల ద్వారా శారీరక లాభాలు కూడా ఉన్నాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిజోల్ మోతాదులు తగ్గుముఖం పడుతుంది. గుండె వేగం, రక్తపోటు తగ్గుతుంది. శరీరాన్ని కదిలించేలా పురికొల్పటం, కొత్త నాడీ అనుసంధానాలు ఏర్పడటం, వీటితో మెదడు తిరిగి క్రమబద్ధీకరించుకోవటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
READ MORE: Crime: కాబోయే భార్య సె*క్స్‌కు ఒప్పుకోలేదని దారుణం..
భావోద్వేగ ప్రతిస్పందనల ప్రేరేపణకు పాటలు తోడ్పడతాయి. మంచి సంగీతం వినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగ విశ్లేషణకు వీలు కల్పించటం, ఇబ్బంది కలిగించే భావోద్వేగాలను వెలిబుచ్చటానికి సహకరించటం, మూడ్‌ను నియంత్రించటానికి తోడ్పడుతుంది. మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.