Monsoon Mosquito Prevention: సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దోమలు అందరినీ భయ పెడుతుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రతి చిన్న చెరువులో, ఇంటి దగ్గర, వీధుల్లో నీరు నిలిచిపోయి దోమలకు ఊపిరి పుట్టుకకు కారణంగా మారుతుంటాయి. రోజు రోజుకు దోమల సంఖ్య పెరిగిపోతుండటంతో, ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. దోమలు మన మీదే మెరుపులా దాడి చేస్తుంటాయి. అయితే.. దోమలు కుట్టకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే మలేరియా, డెంగీ, గన్యా వంటి జబ్బుల బారినపడే ప్రమాదముంది. ఈ చిట్కాలు పాటించి దోమలు కుట్టకుండా బయటపడండి..
READ MORE: Allu Arjun : అల్లు అర్జున్ సంచలన రికార్డు.. టాలీవుడ్ లో తొలి హీరో
దోమలను తరిమే మలాములను చర్మానికి రాసుకోవాలి. ఇవి కళ్లు, నోటికి తగలకుండా చూసుకోవాలి.
వదులైన, పొడవైన చేతుల చొక్కా, ప్యాంట్లు ధరించాలి. సాయంత్ర వేళలో దోమలు చాలా చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇంట్లో, చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. నీటి తొట్టిలపై మూత పెట్టుకోవాలి. కూలర్ల వంటివి ఖాళీ చేసుకోవాలి. పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాల వంటి వాటిని దూరంగా పారెయ్యాలి. చెమటలోని ల్యాక్టిక్ ఆమ్లానికి దోమలు బాగా ఆకర్షితమవుతాయి. కాబట్టి శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి. పర్‌ఫ్యూమ్స్ వంటి పరిమళ ద్రవ్యాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇవంటే దోమలకూ ఇష్టమే మరి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు మూసేయాలి. జాలీలు బిగించుకున్నా మంచిదే. రాత్రిపూట మంచానికి దోమ తెరలు కట్టుకోవాలి. ఫ్యాన్ వేసుకున్నా మేలే. చెత్తకుండీల మీద గట్టిగా మూత పెట్టుకోవాలి.
READ MORE: AI: 99 శాతం ఉద్యోగాలను తినేయనున్న ఏఐ..