యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
భారతదేశంలో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లను జనాలు మెుదట నుంచి ఆదరిస్తున్నారు. తాజాగా గత నెలలో అంటే జూన్ 2025లో మారుతి సుజుకి అత్యధిక కార్లను విక్రయించింది. జూన్‌లో మారుతి సుజుకి మొత్తం 1,18,906 మంది కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది.
ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కాలుష్యం జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ పొల్యూషన్ పెరగడానికి ప్రధాన కారణం.. పాత వాహనాలు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకుంది. ఇకపై వీటికి పెట్రోల్ బంకుల్లో 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు…
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.
ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 16 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు.
మైనర్ బాలికను "ఐ లవ్ యు" అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టీమిండియా మాజీప్లేయర్, లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి టెస్టులో మన బ్యాటర్లు సెంచరీలు చేసిన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టులో మనవాళ్లు 5 సెంచరీలు చేశారు. కానీ డాడీ హుండ్రేడ్స్ ఎక్కడా.. అని ప్రశ్నించాడు. అవి చేయలేదు కాబట్టే మ్యాచ్ ఓడిపోయారు. అంతే కాదు కొంతమంది బ్యాటర్లు డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని ఆరోపించాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి.