భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.
వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఓ…
వారిద్దరూ వరుసకు బావా మరదళ్లు. అయినంత మాత్రాన వివాహేతర బంధం అంటగట్టారు. అంతే కాదు.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న తమ భాగస్వాముల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కున్నారు. చిత్ర హింసలు అనుభవించారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. బంధుత్వం, ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు.. ఈ మూడింటి మధ్య ఊగిసలాడుతూ, ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో కలకలం రేపింది..
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్థానిక పరిపాలనతో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు అమిత్ షా తెలియజేశారు.
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసు ముగిసింది. ఈ కేసును కోజ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ముగింపు నివేదికను కోర్టు అంగీకరించింది. నజీబ్ అహ్మద్ అక్టోబర్ 15, 2016 నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సీబీఐ నివేదికలో నజీబ్ మిస్సింగ్‌పై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు అదనపు చీఫ్ జ్యుడీషియల్…
జూన్ 22న అమెరికా తన B-2 బాంబర్ విమానాల నుంచి ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై బంకర్-బస్టర్ (GBU-57/A మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్) బాంబులను జారవిడిచిన విషయం తెలిసిందే. ఈ వైమానిక దాడిలో ఇరాన్ కి చెందిన ప్రధాన అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసమైంది. వాస్తవానికి, ఇరాన్ పర్వతాల మధ్య భూమికి100 మీటర్ల లోతులో ఫోర్డో అణు కర్మాగారాన్ని నిర్మించింది. ఇది సాధారణ బాంబుల ద్వారా దెబ్బతినే అవకాశమే లేదు. అందుకే అమెరికా ఈ అణు కర్మాగారంపై […]
ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్‌లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కు చర్య తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ముఖ్యమంత్రి మార్పుపై రాష్ట్రంలో ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా మీడియా ప్రతినిధులు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతిలో ఉంది.