Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. వచ్చే నెల10వ తేదీన పవన్ కల్యాణ్ వస్తారని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సమావేశంలోపు పరిష్కార మార్గాలుపై అధికారులతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారన్నారు. పవన్ వచ్చేంత వరకు ఈ 16 రోజులు తాము వేటకు వెళ్ళమని మత్స్యకారులు తేల్చిచెప్పారు. అప్పటికి డిప్యూటీ సీఎం రాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
READ MORE: UNGA: వాహ్… ముస్లిం దేశాధినేత నోటి నుంచి ‘‘ఓం శాంతి, షాలోమ్’’..
కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. నిరసనకారులు మొండి పట్టుపట్టడంతో వచ్చే నెల 10 తేదీన వస్తానని చెప్పారు.
READ MORE: Redmi A5 Airtel: ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్.. 6 వేలకే 5200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ షావోమీ ఫోన్!
అసలు ఏం జరిగింది?
తమ డిమాండ్లను పరిష్కరించి, న్యాయం చేయాలని తీరప్రాంత మత్స్యకారులు మూకుమ్మడిగా రోడ్డె క్కారు. కాకినాడ జిల్లా ఉప్పాడ, అమీనబాద్ గ్రా మాలకు చెందిన సుమారు 500 మంది మత్స్య కారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఉప్పాడ బీచ్‌రోడ్డులో ఆందోళన చేపట్టారు. ఉప్పాడ-కాకినాడ, కాకినాడ-తుని, ఉప్పాడ- పిఠా పురం రోడ్లకు మత్స్యకారులు ఐరన్ టేబుళ్లను అడ్డంగా వేని రహదారులను నిర్భందం చేశారు. రెండు రోజులుగా ఆందోళన సాగించారు. సముద్ర తీరప్రాంతాల్లో నెలకొల్పిన రసాయన పరిశ్రమల నుంచి విడుదల చేసిన రసాయనాల కారణంగా మత్స్యసంపద పూర్తిస్థాయిలో నశించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సముద్రంలో చేపలు దొరుకుతాయనే నమ్మకంలేదని వాపోయారు. వేట తప్ప మరో ఉపాధి తమకు తెలియదని, రసాయన పరిశ్రమల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.