మహాభారత పంచమవేదంగా కీర్తి గాంచింది. వ్యాసుడు మనవాళికి అందించిన అమృత భాండం మహాభారతం.. ఈ మహాత్తర ఘట్టంలో ధృతరాష్ట్ర, గాంధారిల సంతానం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దంపతులకు వంద మంది కుమారులు ఉన్నారని మనం చిన్నప్పుడే చదివాం. తాజాగా ఓ వ్యక్తి తనకు కూడా వంద మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు. ఇది విన్న జనం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏ దేశానికి చెందిన వాడు? ఈ సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నాడు. అనే వివరాలు తెలుసుకుందాం..
READ MORE: H-1B Visa Row: ‘‘మా దేశానికి వచ్చేయండి, ఎక్కువ సంపాదిస్తారు’’.. H-1B వివాదం మధ్య జర్మనీ ఆహ్వానం..
ఎమిరాటీ పరిశోధకుడు సయీద్ ముస్బా అల్ కెట్బీ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. తనకు నలుగురు భార్యలు, 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని సయీద్ ముస్బా అల్ కెట్బీ వెల్లడించాడు. ఈ వార్త విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నివ్వేరపోయారు. తన పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తూనే తన సాంస్కృతిక విలువలను కాపాడుకున్నానని చెప్పాడు. ఈ విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. గల్ఫ్ న్యూస్ ప్రకారం.. వార్షిక ఫోరమ్ సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్‌లో జరిగింది. సాంస్కృతిక వారసత్వంపై పరిశోధన చేసే యుఎఇ పరిశోధకుడు సయీద్ ముస్బా అల్ కెట్బీ కూడా ఈ ఫోరమ్‌కు హాజరయ్యారు.
READ MORE: C.P. Radhakrishnan: తెలుగు భాష, సంస్కృతి వైభవాన్ని కొనియాడిన ఉపరాష్ట్రపతి..
షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్ (SIH) అనేది షార్జాలో ఉన్న ఒక సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కాపాడటం, నమోదు చేయడం, విస్తరించడం. సెమినార్లు, ఉపన్యాసాలు, ఫోరమ్‌ల ద్వారా తమ విలువలను కాపాడుకునేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ముస్బా అల్ కెట్బీ తన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు. తన ప్రసంగంలో అతను తన వ్యక్తిగత జీవితం గురించి వివరాలను వెల్లడించారు. తన పిల్లలలో ఎమిరాటీ విలువలు, మర్యాదలు నియమావళి అయిన అల్ సనాను పెంపొందించడంపై దృష్టి సారించానని అల్ కెట్బీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. లక్షల సంఖ్యలో జనాలు ఈ వీడియోను వీక్షించారు. యూఏఈ ప్రజలు కెట్బీ ఆరోగ్యం, వారసత్వం పెంపుపై అతని నిబద్ధతను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్లు చేయడం గమనార్హం. కానీ.. ఈ వార్త విన్న భారతీయులు మాత్ర “ఒరేయ్.. నువ్వు మనిషివా? మానవ మృగానివా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.