Maoist Party: “మాకు భద్రత కల్పించండి.. అందరం లొంగిపోతాం”.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టుల విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Party: మావోస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తులు చేశారు. తమకు భద్ర కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ గృహ మంత్రి విజయ్ శర్మకు CPI (మావోయిస్టు) పశ్చిమ సబ్‌జోన్ బ్యూరోకు చెందిన కీలక నేత వికాస్ లేఖ రాశారు. ఆయుధాలతో సహా ప్రధాన ప్రవాహంలోకి చేరేందుకు సిద్ధమని ఆ లేఖలో వెల్లడించారు. బలాంగిర్–బర్గఢ్–మహాసముంద్ ప్రాంతాలకు చెందిన BBM డివిజన్ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ప్రజా యుద్ధం కొనసాగించడం సరైన మార్గం కాదని, భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయడమే ప్రజలకు మేలు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ భద్రతపై ప్రభుత్వ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ.. ఆ హామీని రేడియో ద్వారా నేరుగా వినాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత రెండు నుంచి మూడు రోజుల్లో బయటకు వచ్చి లొంగిపోతామని తెలిపారు. ఇప్పటికే మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ, 28 రోజుల ముందుగానే మహాసముంద్ జిల్లాలో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
READ MORE: Samantha : నాగ చైతన్యతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ పై సమంత ఎమోషనల్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
అంతేకాదు.. లొంగుబాటు చేసిన మావోయిస్టులను ఇళ్లకు పంపకుండా బారక్కుల్లో ఉంచుతున్నారని, గడువు ముగిసిన తరువాత మళ్లీ కేసుల్లో ఇరికించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే మీడియా ద్వారా లొంగుబాటు నిర్ణయం ప్రకటించిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో కూంబింగ్, ఎన్‌కౌంటర్ ఘటనలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో లొంగుబాటు చేయాలా, ఛత్తీస్‌గఢ్‌లో చేయాలా అన్న అంశంపై చర్చ జరిగినప్పటికీ, తమకు చెందిన ఇతర సభ్యుల అభిప్రాయంతో చివరికి ఛత్తీస్‌గఢ్‌కే రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక బృందం ముందుగా వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని, మిగతా సభ్యులు దశలవారీగా చేరతారని పేర్కొన్నారు.
READ MORE: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
ప్రభుత్వం ప్రకటించాల్సిన మూడు అంశాలు:
1. సాయుధ పోరాటాన్ని విరమించి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన మావోయిస్టు పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలి.
2. మావోయిస్టులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకొని, జైళ్లలో ఉన్నవారిని విడుదల చేయాలి.
3. భారత రాజ్యాంగ పరిధిలో బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి.
ఈ మూడు ప్రకటనలు చేస్తే జైళ్లలో ఉన్నవారు కూడా సాయుధ పోరాటాన్ని విడిచిపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పోలీసు చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తాము బయటకు వచ్చే వరకు గ్రామాల్లో కూంబింగ్ ఆపాలని, ప్రజలపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా రాష్ట్రంలోని బలాంగిర్, బర్గఢ్ జిల్లాల్లో కూడా పోలీసు ఆపరేషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో లొంగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు, మాజీ మావోయిస్టు సాగర్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని లేఖ చివరలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి