Delhi Air Pollution Deaths 2023: ఢిల్లీ గాలి విషపూరితంగా మారింది. ఈ విషపూరిత గాలిని పీల్చి చాలా మంది మరణించారు. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) తాజా నివేదిక ప్రకారం.. 2023లో రాజధానిలో 17,188 మరణాలు వాయు కాలుష్యం వల్లనే సంభవించాయి. ఢిల్లీలో మరణాలకు ప్రధాన కారణం కణ పదార్థం (PM2.5). అంటే, సూక్ష్మమైన గాలి కాలుష్య కారకాలు అని అర్థం. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) విశ్లేషణ ప్రకారం.. 2023లో ఢిల్లీలో జరిగిన అన్ని మరణాలలోను తీసుకుంటే ఇందులో కాలుష్యంతో సంభవించిన మరణాలు దాదాపు 15%. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సాంప్రదాయ ఆరోగ్య సమస్యల కంటే ఢిల్లీలోని కలుషిత గాలి మరింత ప్రమాదకరంగా మారిందని నివేదిక పేర్కొంది.
READ MORE: Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ.. కొత్త పేరు ఇదే!
2023లో ఢిల్లీలో జరిగిన ప్రధాన మరణాలకు ఇతర కారణాలు..
అధిక రక్తపోటు: 14,874 మరణాలు (12.5%)
అధిక రక్త చక్కెర (మధుమేహం): 10,653 మరణాలు (9%)
అధిక కొలెస్ట్రాల్: 7,267 మరణాలు (6%)
ఊబకాయం (అధిక BMI): 6,698 మరణాలు (5.6%)
READ MORE: Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ.. కొత్త పేరు ఇదే!
ఢిల్లీ గాలి ఏడాదికేడాదికి విషపూరితంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. PM2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల కంటే చాలా రెట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. కాలుష్యం వల్ల పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్, ఉబ్బసం కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాలుష్యం ఇకపై కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, ప్రజారోగ్య సంక్షోభంగా మారిందని CREA నివేదిక చెబుతోంది. ఈ ప్రమాదం నుంచి ఢిల్లీని కాపాడుకోవాలంటే, ప్రభుత్వం నిర్దిష్టమైన శాస్త్రీయ ఆధారిత విధానాలు, కఠినమైన నియమాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడం, వాహన ఉద్గారాలపై కఠినమైన నియంత్రణ, గ్రీన్ జోన్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. లేందంటే.. రాబోయే సంవత్సరాల్లో ఢిల్లీలో కాలుష్యం కారణంగా మరణాల సంఖ్య మరింత భయానకంగా మారవచ్చని నివేదిక హెచ్చరిస్తోంది.