Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
READ MORE: Jatdhara: ఫిజికల్‌గా .. నా కెరీర్‌లో ఇది అత్యంత కష్టమైన పాత్ర..
యాదయ్య కుటుంబంలో తరచూ వివాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా గ్రామంలో భార్యాభర్తల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి యాదయ్య ఉన్మత్తుడై కత్తితో భార్య అలివేలు(32), కుమార్తె శ్రావణి, ఇంటికి వచ్చిన వదిన హన్మమ్మ (40)పై కొడవలితో దాడి చేశాడు. ముగ్గురి గొంతు కోసి అక్కడికక్కడే చంపేశాడు. అంతేకాకుండా మరో కూతురు అపర్ణపై సైతం దాడి చేయడానికి యత్నించారు. ఆమె తృటిలో తప్పించుకుంది. అనంతరం యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్యలను కళ్లార చూసి చిన్న కూతురు వెంటనే పొరుగువారికి సమాచారం ఇచ్చింది. వాళ్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు. ఈ భయానక ఘటనతో కుల్కచర్ల ప్రాంతం ఒక్కసారిగా షాక్‌లో మునిగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ మూడుగురు హత్యలకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
READ MORE: Koti Deepotsavam 2025 Day 1: శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం