Hyderabad Crime: ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కంట్రీ మేడ్ పిస్టల్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. బీహార్ లో తయారు చేసిన ఆయుధాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తునట్లు గుర్తించారు. చర్లపల్లి, మల్కాజ్గిరి ఎస్ఒటీ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఈ గ్యాంగ్ గుట్టురట్టయింది. 3 పిస్టల్స్, 10 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు.. బీహార్‌కి చెందిన శివ కుమార్‌ను అరెస్ట్ చేశారు.. మరో నిందితుడు బీహార్ కి చెందిన కృష్ణ పవన్ పరారీలో ఉన్నాడు..
Jammu Kashmir Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్ కిష్త్వార్లోని చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం(క్లౌడ్‌బరస్ట్) సంభవించిన విషయం తెలిసిందే. దీంతో సంభవించిన ఆకస్మిక వరదలు, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు.
Banjara Hills Peddamma Temple Demolition: బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ECI Slams Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్‌కి చెందిన నేతలు ఓటు చోరి అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది.
Raghunandan Rao Questions Rahul Gandhi: రాయబరేలి రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికకు సిద్ధమా? అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకించింది.. కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈవీఎంలకి మద్దతు ఇచ్చామన్నారు.
KTR: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని తెలిపారు.
HCA Funds Misuse: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ నిర్వహిస్తేనే నిధుల దుర్వినియోగంపై సీఐడీకి క్లారిటీ రానుంది. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిననాటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.
Karnataka: పిలిచి పిల్లనిస్తే.. అత్తను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడైన అల్లుడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోలాలలో జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ఖండఖండాలుగా నరికేశాడు దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా పోలీసులకు దొరక వద్దనే ఉద్దేశ్యంతో వాటిని కవర్లలో ప్యాక్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. కానీ పాపం పండడంతో డాక్టర్ అల్లుడు దొరికేశాడు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కోలాలలో జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను మర్డర్ చేసింది అల్లుడు డాక్టర్…
Adilabad: హనీ ట్రాప్‌లో ఇదో రకం. కేవలం బైక్ మీద లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచే డబ్బులు గుంజింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళతోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బైక్ మీద వెళ్లే వాళ్లు.. సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. కాదనకుండా ఇస్తారు.. అందులోనూ మహిళలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. వారు ఇబ్బంది పడకూడదని.. మానవత్వంతో వారు దిగాల్సిన చోటు వరకు తీసుకు వెళ్తుంటారు. కానీ అలా ఓ…