Delhi Blast Case: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు పెద్ద పురోగతి సాధించాయి. హర్యానాలోని ఖండావాలి గ్రామం సమీపంలో ఫరీదాబాద్ పోలీసులు ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు (DL10CK0458)ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు హెచ్చరిక జారీ చేసిన కారు ఇదేనని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, ఇతర కేంద్ర సంస్థలకు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఈ కారు నవంబర్ 22, 2017న ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ RTOలో రిజిస్టర్ చేయబడింది. ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన అనుమానితులలో ఒకరైన ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మొహమ్మద్ పేరుతో ఈ కారును కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది .
READ MORE: Bomb Threats: బిగ్ అలర్ట్..! శంషాబాద్ సహా ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమర్ మొహమ్మద్ కారు కొనుగోలు చేసేటప్పుడు నకిలీ చిరునామాను ఉపయోగించాడు. అతను పత్రాలపై ఈశాన్య ఢిల్లీలోని ఒక ఇంటి చిరునామాను అందించాడు. ఢిల్లీ పోలీసులు నిన్న అర్ధరాత్రి అదే చిరునామాలోని ఇంటిపై దాడి చేశారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఖండావాలి గ్రామంలో కారును ఎవరు? ఎప్పుడు? వదిలి వెళ్ళారో తెలుసుకోవాడానికి దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
READ MORE: RCB 2026 Venue: RCB హోమ్ గ్రౌండ్ మారుతుందా? కొత్త గ్రౌండ్ ఏదో తెలుసా!