Massive Cloudburst: నేడు 79 స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశమంతా ఘనం జరుపుకుంటున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో మాత్రం క్లౌడ్ బస్టర్‌తో మృత్యోఘోస వినబడుతోంది. కిష్త్వార్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో చషోటి, పద్దర్ తషోటిలో అకస్మాత్తుగా మేఘాల విస్ఫోటనం(క్లౌడ్‌బరస్ట్) సంభవించింది.
Pilot Rohit Reddy: పార్టీ మార్పుపై ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తనపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
Moinabad News: దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా.. ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరింది. కానీ.. ఓ ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం మధ్యాహ్నం పన్నెండు అయినా జెండా ఎగరలేదు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
Visakhapatnam: అది విశాఖ పట్నం శివారు ప్రాంతం.. హైవేకు 150 మీటర్ల దూరం. చుట్టు గుబురుగా పెరిగిన సరుగుడు తోట.. పొదల్లో ఓ మహిళ మృతదేహం. సగం కాలిపోయి గుర్తుపట్టడానికి వీలుకాని స్థితిలో డెడ్ బాడీ. పరిశీలించగా ఆమె నెలలు నిండిన గర్భిణీ. ఇంతకీ ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి తగలబెట్టారా? లేదంటే ఇక్కడే చంపేసి తగలబెట్టి పారిపోయారా? ఒక మృత దేహం ఎన్నో ప్రశ్నలు? అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.…
Gujarat Honour Killing: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణం జరిగింది. కూతురు ప్రేమను అంగీకరించని ఓ తండ్రి ఆమెకు మరణశాసనం లిఖించాడు. తుచ్ఛమైన పరువు కోసం.. చేజేతులా కన్నకూతురును చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు చంద్రిక. ఈ అమ్మాయి నీట్ పరీక్ష కోసం పాలన్‌పూర్‌లో కోచింగ్ తీసుకుంది. నీట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఐతే పాలన్‌పూర్‌లో ఉన్న సమయంలోనే…
POCSO: చిన్నారుల జీవితాలను మొగ్గలోనే చిదిమేస్తున్నారు కామాందులు. ఆభం శుభం తెలియని వారి ప్రాణాలను.. కొందరు మృగాళ్లు తమ కామవాంఛ కోసం గాల్లో కలిపేస్తున్నారు. ఇలాగే కామంతో కళ్లు మూసుకుపోయి ఓ చిన్నారిని చిదిమేసిన మానవ మృగానికి ఉరిశిక్ష విధించింది నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన మానవ మృగానికి.. నల్లగొండ జిల్లా ఫోక్సో కోర్టు ఉరి శిక్ష విధించింది. అంతే కాదు దోషికి రెండు ఉరి శిక్షలు విధించిన కోర్టు.. లక్షా…
MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌజ్‌కి వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం ఫామ్ హౌజ్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఎల్లుండి అమెరికాకు బయలు దేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్, కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
Hydra: హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. కొన్ని సామాజిక మాధ్యమాలు పనికట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నాయని హైడ్రా పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎక్కడ ఎవరు కూల్చివేతలు చేపట్టినా హైడ్రాకు అంటకట్టి దుష్ప్రచారం సాగిస్తూ వస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా.. ప్రజలకు మేలు చేద్దామని, మెరుగైన జీవనాన్ని అందిద్దామని హైడ్రా అహర్నిశలూ కష్టపడుతూ వస్తోంది. పర్యావరణహితమైన నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే 6 చెరువుల అభివృద్ధిని చేపట్టింది. అంబర్‌పేటలోని బతుకమ్మ…
Hyderabad: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమానుషంగా వ్యవహరించింది. విసిగిస్తున్నారని ఓ విద్యార్థిని చితకబాదింది. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సురాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిపై టీచర్ దాడి చేసింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించిన కొంతమంది వ్యక్తులను కలిసిన విషయం తెలిసిందే. బీహార్ నుంచి వీరిని ఢిల్లీకి పిలిపించి వారితో కలిసి టీ తాగారు. అనంతరం రాహుల్ గాంధీ సోషల్ సైట్ ఎక్స్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై వ్యంగ్యంగా స్పందించారు. "నాకు జీవితంలో చాలా ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి..