AP Weather Alert: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం, పాలకాయత్తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం వద్దకు వెళ్లిన పర్యాటకులను స్థానిక పోలీసులు వెనక్కి పంపుతున్నారు..
Manchu Lakshmi Appears Before ED: మంచులక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది.. సుమారు మూడు గంటల పాటు మంచు లక్ష్మీని ఈడీ విచారించింది. యోలో 247 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మూడున్నర గంటలపాటు విచారణ కొనసాగింది. మంచు లక్ష్మీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించింది.
Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని చెప్పారు. రాజకీయ పరంగా అక్రమ కేసులు…
Snake Found in Curry Puff: చాలా మంది బయటి ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు. అయితే తినేది ఆహారమా.. విషమా..? అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
Minister Nara Lokesh: పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది!.. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం.. భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
YSRCP urges the Election Commission: జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ జరపాలని కోరింది. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేశారని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర బలగాలతో ఎన్నికల నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారని.. వారికి పోలీసులు సహకరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారు.. టీడీపీ నేతలు…
CM Chandrababu: విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను... విద్యుత్ సంస్కరణలు తెచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 యంగ్ ప్రొఫెషనల్స్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. యంగ్ ప్రొఫెషనల్స్ గా నియమితులైన వారికి ప్రణాళిక శాఖ నియామక పత్రాలు అందించింది. నియోజకవర్గాల బలాలను బేరీజు వేయండి.. అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. విజన్ తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని..
Former CM YS Jagan accused Chandrababu Naidu: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను బలవంతంగా కైవసం చేసుకునేందుకు చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రాన్ని రౌడీల పాలన వైపు నడిపిస్తున్నారన్నారు.. ముఖ్యమంత్రిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారు.. అధికారులను తన ఆధీనంలోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను ఒక ఉగ్రవాదిలా హైజాక్ చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. ప్రజాస్వామ్యం దెబ్బతిన్న ఇవాళ నిజంగా బ్లాక్ డే అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.…
ZPTC By-Election: వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఘర్షణలతో పోలింగ్ సాగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్యే జరిగింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి.. ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి (టీడీపీ), ఇరగం రెడ్డి (వైసీపీ) తలపడ్డారు.…
AP Nominated Posts: ఏపీలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. 31 పదవుల భర్తీకి సంబంధించిన జాబితా విడుద చేసింది. ఓసి - 6, బీసీ - 17, ఎస్సీ - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 పోస్టులు కేటాయించారు. టీడీపీకి అత్యధికంగా 26 పోస్టులు రాగ.. జనసేనకు మూడు, బీజేపీకి రెండు పోస్టులు వరించాయి. ఈ పూర్తి పట్టికను ఇప్పుడు పరిశీలిద్దాం..