AP Heavy Rains Holiday: ఏపీలోని పలు జిల్లా్ల్లో వర్షం దంచికొడుతోంది. అకాల వర్షానికి జనా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. ఇళ్లలోనే ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లు సూచించారు.
VinFast Minio Green EV: వియత్నామీస్(వియత్నం) కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ జూలై 15న తన మొదటి షోరూమ్‌ను ప్రారంభిస్తూ.. భారత్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. కంపెనీ తన రెండు ఎలక్ట్రిక్ కార్లు VF6, VF7 లను స్థానిక మార్కెట్లో ప్రదర్శించింది. వీటి బుకింగ్ ఇప్పటికే ప్రారంభయ్యాయి. తాజాగా కంపెనీ భారత్‌లో మరో ఎలక్ట్రిక్ కారు
Vijayawada Lashed by Heavy Rains: బెజవాడను ముంచెత్తిన వర్షం ముంచెత్తింది. 2 గంటలుగా దంచికొడుతోంది. నిన్న రాత్రి, ఇవాళ సాయంత్రం బెజవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం తో నగరంలో ఉన్న ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగ్ నగర్, వన్ టౌన్ వాసులు ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది మాదిరి బుడమేరు పొంగుతుందని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బుడమేరు వల్ల ఇబ్బంది లేదని బుడమేరు ప్రవాహం నిలకడ గా ఉందని అధికారులు చెబుతున్నారు. కంట్రోల్ రూమ్…
Former Jammalamadugu MLA Sudheer Reddy was arrested : జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో అరెస్టు చేసినట్టు సమాచారం.
Asaduddin Owaisi Slams Pakistan PM: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమన్నారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటే.. మరికొంతమంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ లేదా సొంత వాహనాలతో తిరుమలకు వస్తుంటారు. అయితే సొంత వాహనాలలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక జారీ చేసింది.
CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
MLA Balakrishna Makes Controversial Remarks: హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం విధివిదానాలపై మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు.
ఒంటిమిట్టలో నామినేషన్ వేసిన దగ్గర్నుంచి టీడీపీ ముగ్గురు మంత్రులు సవిత, జనార్ధనరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ప్రలోభాలకు గురిచేశారని ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక మొదలవుతుండగానే మా పార్టీకి చెందిన ఏజెంట్లను ఇబ్బంది పెట్టారు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.
Vijayawada: విజయవాడలో నిన్న రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసి వదిలేసిన మ్యాన్ హోల్ ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది.. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.