Hyderabad Khazana Jewellers Robbery Case: ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో కీలక పురోగతి లభించింది.. ముగ్గురు దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సిగాన్, సారక్ గ్యాంగులుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు దొంగతనానికి ముందు పటాన్ చెరువు ఆర్సీపురం చందానగర్ లోని జ్యువెలరీ షాపులపై రెక్కీ నిర్వహించారు.
Monsoon Diet: వర్షాకాలం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో జనాలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తరచూ జబ్బుపడుతుంటారు. వారికి మంచి ఇమ్యూనిటీ పవర్ అవసరం అందుకే కింద పేర్కొన్న ఈ ఆహారపదార్థాలను తినడం వల్ల అనే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంతకీ ఏం తినాలి? అవి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం...
Heavy Rains: తెలంగాణాలో మళ్లీ వర్షం మొదలైంది. పలు జిల్లాల్లో దంచికొడుతోంది. తాజాగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించింది వర్షం. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెం. మీ, మెదక్ జిల్లా శివంపేటలో 12.8 సెం.మీ మేర వర్షపాతం నమోదయ్యాయి.
Hyderabad: గాంధీనగర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ప్రాంతం కవాడిగూడలో నివాసం ఉంటున్న రాజేష్ (19) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇష్టం లేని ఉద్యోగానికి వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల క్రితమే హిమాయత్‌నగర్‌లో ప్రైవేట్ కాల్ సెంటర్లో ఉద్యోగానికి చేరాడు రాజేష్. కాల్ సెంటర్లో జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పాడు. జాబ్ చేయాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లు తెలిపారు.
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు తీయాలన్నారు.
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
Krishna Janmashtami 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీ కృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి వ్రతం చేస్తారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. రేపే శ్రీకృష్ణుడి జన్మష్టమి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశం…
Mother Kills 25-Year-Old Son for Opposing Illicit Affair: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని 25 ఏళ్ళ కన్న కొడుకుని తల్లి చంపేసింది. హత్యకు ప్రియుడు సైతం సహకరించారు. 9 నెలల తర్వాత అహ్మద్ పాషా (25) హత్య కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ (మం) వెంకటాయపల్లిలో ఘటన చోటు చేసుకుంది.
Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని, శ్రీకృష్ణాష్టమి... జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. ఈ ఏడాది ఆగస్టు 16న గోకులాష్టమి జరుపుకోనున్నారు. ఈ రోజున విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
Putin- Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చించడానికి రెండు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. అయితే పుతిన్‌కు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ట్రంప్ ఏడవసారి మాత్రమే అధ్యక్షుడు పుతిన్‌ను కలవబోతున్నారు. కానీ.. పుతిన్ మాత్రం తన హయాంలో ఐదుగురు అమెరికా అధ్యక్షులతో 48 సార్లు సమావేశమయ్యాయి. ట్రంప్-పుతిన్ మధ్య అనుభవ వ్యత్యాసం చాలా ఉంది.