India-USA: భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నియమాలు కూడా మారుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తుంది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
Ganesh Chaturthi 2025: ఈ నెల 27 దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కానుంది. ఈ మేరకు నెల రోజుల నుంచే చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ఎప్పటి కప్పుడు ఆంక్షలు పెడుతూనే ఉంటారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు గానే తెలంగాణ పోలీసు అధికారిక…
Ganesh Chaturthi 2025: రాష్ట్రవ్యాప్తంగా ఊరూ-వాడ వినాయక చవితి సందడి నెలకొంటోంది. బొజ్జగణపయ్య ప్రతిష్ఠాపనకు పెద్దసంఖ్యలో మండపాలు కొలువుదీరుతున్నాయి. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలసికట్టుగా జరుపుకునే ఈ పండుగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చిన్నారులలో వినాయక చవితి వేడుకలు పట్టలేనంతా ఉత్తేజాన్ని నింపుతాయి. ఇటు మండప నిర్వాహకులు.. అటు పోలీసు, మున్సిపాలిటీ, జల మండలి, విద్యుత్ విభాగాల అధికారులంతా చవితికి పక్షం రోజుల ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో మునిగిపోతారు.. అయితే మనం ఇప్పుడు మండపాలు ఏర్పాటు…
Kim Jong Un Emotional: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య స్నేహం విడదీయరానిదని చెబుతతారు. రష్యాతో స్నేహాన్ని కొనసాగించడానికి కిమ్ జోంగ్ ఉన్ చేసిన పనికి మొదటిసారి మోకాళ్లపై కూర్చొని మరీ ఏడవాల్సి వచ్చింది. సాధారణంగా, కిమ్ జోంగ్ ఏడుస్తున్నట్లు ఎవరూ ఎప్పుడూ చూడలేదు! కానీ ఈసారి అతను ఒక వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.. కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చుట్టుపక్కల జనాలు, సైనికులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన నియంత…
Parliament: ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 2023 మే 28న ఈ భవనాన్ని ప్రారంభించారు. రెండెళ్లుగా అదే భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా భవనానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ భవనంలో ‘నంబర్ 1 (Number 1 Tree)’ పేరు గల ఓ పసుపు పూల చెట్టు ఉంది. ఇది ఇప్పుడు ప్రధాని మోడీతో సహా వీవీఐపీల భద్రతలు ముప్పుగా మారిందట. దాన్ని అక్కడ నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కథ…
Cyber Crime: ప్రస్తుతం సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. అమాయక ప్రజలనే టార్గెట్ చేసిన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వింతైన సైబర్ నేరం బయటపడింది. మహారాష్ట్రలోని హింగోలీలో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సైబర్ నేరగాళ్లు మోసం చేసింది మామూలు వ్యక్తిని కాదు ప్రభుత్వ ఉద్యోగిని. అసలేం జరిగిందంటే..
Congress MLA KC Veerendra Arrested: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో నిషేధించబడిన చైనా షార్ట్-వీడియో యాప్ టిక్‌టాక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతమంది వినియోగదారులు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలిగామని చెబుతున్నారు. దీంతో యాప్ తిరిగి భారత్‌లోకి అడుగుపెడుతుందని ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్రమయ్యాయి. అయితే, టిక్‌టాక్ యాప్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో లేదు. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారత్‌కి తిరిగి రావడం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి మాత్రం ఏదో తక్కువైంది. ఏం తక్కువై ఉంటుంది? అని ఆలోచిస్తు్న్నారా? ఆయనకు లడ్డూ ఇవ్వలేదు. అదే పెద్ద లోటుగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తం ఏకంగా సీఎంకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో గ్రామ పంచాయతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
UP: పనిమనిషిని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారి వ్యక్తిత్వం, గుణగణాలను చెక్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్లని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పనిమనిషి చేసిన ఓ అసహ్యకరమైన చర్య బయటకు వచ్చింది. బిజ్నోర్ జిల్లాలోని నాగినా పట్టణంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి చేసిన సిగ్గుచేటు చర్య కెమెరాలో రికార్డైంది. ఆ మహిళ వంటగదిలోని గ్లాసులో మూత్ర విసర్జన చేసి, కడిగిన పాత్రలపై చల్లింది. ఈ సంఘటనకు…