Hyderabad Fake Liquor: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో అక్రమంగా మద్యం లేబల్స్ తయారీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ మద్యానికి లేబుల్స్ వేసి అసలైన మద్యంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. హుజూర్నగర్ నకిలీ మద్యం కేసులో నవీన్ అనే వ్యక్తికి ఈ ముఠా సహకరిస్తుంది. కుషాయిగూడ చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ అరెస్ట్ చేశారు. నిందితులను ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడికి 200 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ 64 ఏళ్ల ప్రాథమిక పాఠశాల టీచర్ని ఒకప్పుడు ఆదర్శ ఉపాధ్యాయుడిగా భావించేవారు. కానీ తెరవెనుక ఆ వ్యక్తి చేసిన క్రూరత్వం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, పాఠశాల బాలికలపై క్రూరంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టలేదు.
world’s most Expensive Water Bottle: ఓ లీటరు మంచినీళ్ల బాటిల్ ధర రూ.20కు దొరుకుతుంది. ప్రాంతాన్ని బట్టి దాని ధర కూడా మారుతుంది. కంపెనీని బట్టి, అందులోని వాటర్ ని బట్టి బాటిల్ ధర పెరుగుతుంది. సెలబ్రెటీలు తాగే వాటర్ ధర అధికంగా ఉంటుంది. ఈ మధ్య 'బ్లాక్ వాటర్' అని ఓ కొత్తరకం నీళ్లొస్తున్నాయి.
How Much Cash Can You Legally Keep at Home: ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపారవేత్త లేదా రాజకీయా నాయకుడి ఇంటిపై దాడి చేసి కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తరచుగా వార్తాపత్రికలలో, టీవీలలో వార్తలు చూస్తుంటాం. ఇవి చూసినప్పుడు సామాన్య ప్రజల మనస్సులలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవడం చట్టబద్ధమైనది? దీనికి ఏదైనా స్థిర పరిమితి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...
IndiGo Flight: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. సీఎంఓ అందించిన సమాచారం ప్రకారం.. ఇండిగో విమానం దిబ్రుగఢ్ నుంచి గౌహతికి వెళుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని అగర్తలాకు మళ్లించారు. దీంతో కొంత సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Rahul Gandhi: ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను చేపట్టారు. యాత్రలో భాగంగా 16వ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణియలోని రోడ్డు మధ్యలో రాహుల్ గాంధీని ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు.
China: ప్రస్తుతం సర్వం ఆన్లైన్ మయంగా మారింది. ప్రపంచం మొత్తం ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కు మారుతోంది. నగదు చెల్లింపు కోసం ప్రజలు ఆన్లైన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే..చాలా మందికి ఆన్లైన్ నగదు చెల్లింపు ప్రయోజనకరంగా ఉంటోంది. కానీ.. ఓ వ్యక్తికి మాత్రం పెద్ద చిక్కుముడి తెచ్చి పెట్టింది. ఈ ఆన్లైన్ చెల్లింపు ద్వారా భార్యాభర్తలు దూరం కావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
Uttarakhand Ex-CM’s Nephew Vikram Singh Rana: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మేనల్లుడు విక్రమ్ సింగ్ రాణా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తనను రూ.18 కోట్ల మోసం చేశారని ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు కనిపించింది. డెహ్రాడూన్ పోలీసులపై రాణా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
UP: యువత ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలోని రామ్గర్తల్ ప్రాంతంలో ఇలాగే ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తునన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
India-USA: భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య నియమాలు కూడా మారుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తుంది. జూలై 30, 2025న అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.