GST Council: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలిరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దీంతో సామాన్యులకు ఉపశమనం…
GST Council Simplifies Tax Slabs: భారతదేశ పరోక్ష పన్ను నిర్మాణంలో కొన్ని ప్రధాన మార్పులను జీఎస్టీ కౌన్సిల్ బుధవారం ఆమోదించింది. ఇప్పుడు వస్తువులపై 5%, 18% స్లాబులు మాత్రమే విధిస్తారు. ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారనుంది. అనేక రోజువారీ వస్తువులు సెప్టెంబర్ 22 నుంచి చౌకగా మారనున్నాయి. కిరాణా వస్తువులు, ఎరువులు, చెప్పులు, బట్టలు, పునరుత్పాదక శక్తి వంటివి తక్కువ ధరకు లభిస్తాయి. గతంలో ఉన్న 12%, 28% పన్నులు విధించిన వస్తువులు 5%, […]
వినాయక చతుర్థి వచ్చేసింది. భక్తులంతా వినాయకుని ప్రతిమలను మండపాల్లో పెట్టి కొలుస్తున్నారు. అయితే.. మనమంతా పెట్టుకునే ఈ గణేశుడి విగ్రహాల ఖర్చు, రంగు, రూపం భిన్నంగా ఉండాలని అందరూ అనుకుంటారు. వారి అభిరుచులకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేయించుకుంటారు. చాలా రకాల వినాయకుడి ప్రతిమలు చూసే ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే 5 స్టార్ చాక్లెట్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా? చూడలేదా.. అలాగైతే.. ఏపీలోని అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. READ MORE: […]
2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహణ మందకొడిగా సాగుతోంది. కానీ.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమిచ్చాడు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. ఈ పండుగ సందర్భంగా జరిగే గణేష్ నవరాత్రులు భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్దశి తిథి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదవ రోజు జరిగే గణేశ్ నిమజ్జనంతో పండుగ ముగిసిపోతుంది. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి తిథి ఆగస్టు 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:54 గంటలకు మొదలై, ఆగస్టు 27, బుధవారం మధ్యాహ్నం…
Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థిని వినాయక చవితి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడని చెబుతారు. అందుకే ఏటా ఇదే రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ 27 ఆగష్టున వచ్చింది. అంటే రేపే వినాయక చవితి. వినాయక చవితి వేడుకలు పది రోజుల పాటు జరుపుకుంటారు.
Mahindra University Drugs Case: తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తుంటారు. బాగా చదువుకుని తమను ఉద్దరిస్తారని భావిస్తుంటారు. కానీ.. నేటి తరం విద్యార్థుల్లో బాగుపడదామనే లక్షణాలు మందగిస్తున్నాయి. మందు, సిగరెట్లు పోయి.. ఇప్పుడు ఏకంగా గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. తాజాగా బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.
Warangal: ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారాడు ప్రియుడు. ఈ ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది కాలంగా వరుస చైన్ స్నాచింగ్‌లతో కలకలం సృష్టించాడు.
Raghunandan Rao: వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు.. మీపై మీకు విశ్వాసం ఉంటే శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామా? రాజీనామా చేసే దైర్యం ఉందా? అని పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఓటు చోరీపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఎంపీ తిప్పికొట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... పీసీసీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు.. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్…