Hyderabad: గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేసిన రవి.. భారీగా ఆదాయం పొందాడు. సినిమా ఇండస్ట్రీకి మాత్రం వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇటీవల సినిమా పైరసీలపై సైబర్ క్రైమ్ ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూవీ పైరసీ తిమింగలం కోసం పోలీసులు కాపు కాస్తూ ఉండగా నిన్న(శనివారం) అదుపులోకి తీసుకున్నారు. ఈ పోలీసు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవి ఒక్కసారిగా అరెస్టు కావడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్‌కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఒక అపార్ట్మెంట్‌లో నివసిస్తున్నాడు.
READ MORE: MM Keeravani: మెలోడీ నాదే.. బీటూ నాదే.. కీరవాణి మాస్ స్పీచ్
ఇక రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందవేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది. ఇలా అతడి అరెస్ట్ వెనుక తన భార్య ప్రమేయం ఉందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కట్టుకున్న భార్య తన పాలిట శత్రువులా మారింది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం రవి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేస్తూ చిత్ర పరిశ్రమకు ప్రాణం పోశారంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
READ MORE: SS Rajamouli: కథ చెప్పేసిన రాజమౌళి.. రాముడిగా కనిపించనున్న మహేష్ బాబు..!