Kerala: బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిక్కన్నపురం నివాసి ఆనంద్ కె. తంపి తన షెడ్‌లో శనివారం ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందినట్లు సమాచారం. తిరువనంతపురం కార్పొరేషన్‌లోని త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని తంపి ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు రాలేదు. ఇది చూసి ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ తనకు టికెట్టు ఇవ్వకున్నా.. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని తంపి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం తన స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపారు. అందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొన్నారు. వాట్సాప్ సందేశాన్ని చూసిన అతని స్నేహితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆ కార్యకర్త ఉచ్చుకు వేళాడుతూ కనిపించారు. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Astrology: నవంబర్ 16, ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
Also Read
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఉద్దేశ్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు ఇప్పటికే తెలియజేసినట్లు తంపి తన సందేశంలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా మాఫియాతో సంబంధం ఉన్న కొంతమంది స్థానిక నాయకుల ప్రయోజనాల కారణంగా తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను ప్రకటించిన తర్వాత.. తన స్నేహితులు సైతం తనకు దూరం కావడం ప్రారంభించారని.. అది తనను నిరాశపరిచిందని సందేశంలో పేర్కొన్నారు. అయితే, టికెట్ కోసం తంపి తమను ఎప్పుడూ సంప్రదించలేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు. టికెట్టు రాకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వాదనలను తోసిపుచ్చారు. ఈ సంఘటనకు టికెట్ నిరాకరించడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్టీ ఖచ్చితంగా దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. “ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అంశంపై జిల్లా అధ్యక్షుడిని విచారించాను. వార్డు స్థాయి నుంచి పంపిన షార్ట్‌లిస్ట్‌లో తంపి పేరు లేదని నాకు తెలిసింది. ఈ విషయంపై పార్టీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది.” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?