Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కి కూత వేటు దూరంలో ఉన్న మెదక్ తలసరి ఆదాయం పెరగలేదన్నారు. పాల రైతులు నష్టపోతున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేట్ పాల వ్యాపారం పెట్టుకుని లాభాలు పొందుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎం PROగా ఉన్న అయోధ్య రెడ్డి హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని చెప్పారన్నారు. హరీష్ రావు ఇన్ని అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తున్న సీఎంకి ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కనీసం సీఎం స్పందించడం లేదని అడిగారు. హరీష్ రావుకి, సీఎం రేవంత్ కి ఉన్న ఒప్పందం ఏంటో సమాధానం చెప్పాలని నిలదీశారు.
READ MORE: Raymond Group: రూ.1201 కోట్ల పెట్టుబడులు.. రేమాండ్ ప్రాజెక్టుకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన..
అనంతరం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కుట్రలు జరిగాయని కవిత ఆరోపించారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లపై పరోక్షంగా సెటైర్లు వేశారు. హరీష్ రావు బీఆర్ఎస్ ని మోసం చేశారని ఆరోపించారు. హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ భజనపరులు భజన చేశారనర్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్ కేసీఆర్ ఫోటో నెత్తిపై పెట్టుకుని పెట్టి.. తానే చేశాను అకున్నారన్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్టు ఆయన బిల్డప్ ఇచ్చుకున్నారన్నారు. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు.. వీళ్ళకి హరీష్ రావు సపోర్ట్ చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు కృష్ణార్జునల బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారు.. వీళ్ళకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడానికి సరిపోతుందన్నారు. వీళ్లకు వీళ్ళు ట్వీట్‌లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
READ MORE: Sonakshi Sinha : మనం చేసే ప్రతి తప్పు.. కొత్త పాఠం నేర్పిస్తుంది