Mancherial: మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mancherial: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు చేరుకోనున్నారు. జిల్లాలోని అధికారులతో పాటు సాధారణ ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం, ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇక మంచిర్యాల చేరుకున్న మంత్రి వర్గం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలన చేపట్టనున్నారు. ఆపై ఇతర స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజలతో కలిసి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:00 నుండి 1:30 గంటల వరకు విశ్రాంతి అనంతరం, 1:30 గంటలకు మంత్రుల బృందం మంచిర్యాల నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ పర్యటన ద్వారా మంచిర్యాల జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని సమీక్షించడంతో పాటు ప్రజలతో నేరుగా కలిసే అవకాశం మంత్రులకు లభించనుంది.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!