Pawan Kalyan: విశాఖ పర్యటనలో పోలీసుల ఆంక్షల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్‌లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేయాల్సి ఉంది. అయితే సభలు, సమావేశానికి పోలీసులు […]
Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత ఆర్ధిక ఏడాది ప్రత్యేక రైళ్ల ద్వారా భారతీయ రైల్వే రూ.17,526.48 కోట్ల ఆదాయం […]
Aimchess Rapid tourney: చెస్ ఆటలో వరల్డ్ ఛాంపియన్, నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ఇటీవల తన ప్రాభావ్యాన్ని కోల్పోతున్నాడు. తరచూ భారత్ గ్రాండ్ మాస్టర్ల చేతిలో ఓటమి పాలవుతున్నాడు. ఇటీవల 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద… మాగ్నస్ కార్ల్‌సన్‌ను నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు ఓడించి చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. తాజాగా మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి కూడా మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్ […]
Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా […]
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని […]
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పసికూన నమీబియా సంచలనం నమోదు చేసింది. శ్రీలంకపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం కరోనా కూడా మెగా టోర్నీకి గుబులు పుట్టిస్తోంది. కరోనా సోకిన ఆటగాడు దూరమైతే పలు జట్లు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది. టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్ […]
Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు. అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని […]
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17 […]
Vidadala Rajini: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి […]
T20 World Cup 2022: భారీ అంచనాల నేపథ్యంలో ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలుత క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. శ్రీలంకపై నమీబియా గెలిచి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 22 నుంచి సూపర్-12 రౌండ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో రిజర్వు డేను కూడా ఐసీసీ అమలు చేస్తోంది. ఈ రిజర్వు డేను కేవలం నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే ఉపయోగించనున్నారు. వర్షం లేదా […]