Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల […]
Vishakapatnam Police: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ పర్యటనలో మంత్రులపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర ఆయనకు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు […]
Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో […]
Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో […]
Team India: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బుమ్రా స్థానంలో ఎవరినీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే తాజాగా బుమ్రా స్థానంలో షమీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతంలో స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో షమీ ఉండగా ప్రస్తుతం తుది జట్టులోకి అతడిని తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారము షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడని.. త్వరలో బ్రిస్బేన్‌లో ఉన్న టీమిండియాతో అతడు కలుస్తాడని […]
T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు […]
Gudivada Amarnath: విశాఖలో ఈనెల 15న పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చీరలు, గాజులు పెట్టి పంపిస్తామన్న జనసేన నేతల వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ దగ్గర చీరలు, గాజులు బోలెడన్నీ మిగిలిపోయాయని.. అందుకే వాటిని ఏం చేయాలో తెలియడం లేదని చురకలు […]
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో మాజీ సీఎం, తన బావ చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను బాలయ్య తన బావ చంద్రబాబును అడిగారు. ముఖ్యంగా బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్ అన్న పదాలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. […]
Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు […]
Ravi Shastri: బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి గంగూలీ తప్పుకోనున్న నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అయితే గంగూలీ, రవిశాస్త్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం భారత క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ ఇంటర్వ్యూకు గంగూలీ ముందు హాజరుకావాలంటే గతంలో రవిశాస్త్రి ఎంతో ఆలోచించాడు. అటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా రవిశాస్త్రి బాహాటంగానే విమర్శించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ […]