Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కోసం అక్రమంగా ఇళ్లను కూల్చివేయడంపై ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా అర్థాంతరంగా అలా కూలుతుందని హెచ్చరించారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారే తమవారని ప్రభుత్వం భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఓటు వేయని వాళ్లను ‘తొక్కి నార తీయండి’ అనే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజధాని అమరావతి పరిధిలోని ఇప్పటం గ్రామం గతంలో జనసేన నిర్వహించిన బహిరంగ సభకు భూమి ఇచ్చినందుకు ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Read Also: CM Jaganmohan Reddy: ఏపీలో పరిశ్రమలకు ప్రభుత్వ చేయూత
మార్చి 14వ తేదీన సభ జరిగితే.. ఆ తర్వాతే రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపు ప్రక్రియను మొదలు పెట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందికే తామ ప్రభుత్వం ఉందనే విధంగా వైసీపీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమేనని.. ఇప్పటికే 70 అడుగుల రోడ్దు ఉంటే ఇంకా విస్తరణేంటి అని నిలదీశారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని.. కూల్చివేత నోటీసులపై గ్రామస్తులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారన్నారు. ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని.. వాహనాల రాకపోకలు ఎక్కువగా లేని గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కక్షతో ఇళ్లని కూల్చేయడానికి 120 అడుగుల మేర రోడ్డు విస్తరణ అంటూ కూల్చివేతలు మొదలెట్టారని పవన్ విమర్శలు చేశారు.
కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/nuuTYYpqje
— JanaSena Party (@JanaSenaParty) November 4, 2022