Lunar Eclipse: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. కానీ చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందో చాలా మందికి తెలియదు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా భూమి సైజు చంద్రుడికి 4 రెట్లు అధికంగా ఉంటుంది.
2022లో ఇదే చివరిదైన చంద్రగ్రహణం. మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రారంభమైన చంద్ర గ్రహణం సాయంత్రం 6:19 గంటల వరకు ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం 3:46 గంటల నుంచి సాయంత్రం 5:12 గంటల మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు. అసోం వంటి తూర్పు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా చంద్రగ్రహణం జరుగుతుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 5:40 గంటలకు ప్రారంభమై రాత్రి 7:26 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అయితే గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఉంటే మంచిది. ఎందుకంటే గ్రహణం వల్ల ఏర్పడే యూవీ రేస్ నేరుగా గర్భిణులపై పడితే పుట్టబోయే బిడ్డకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణుల సూచిస్తున్నారు. అంతే తప్ప గర్భిణులు ఇంట్లోనే ఉంటూ ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. ఆహారం, నీరు కూడా తీసుకోవచ్చు.
Read Also: Lunar Eclipse Live: ప్రారంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం.. మూతపడ్డ ఆలయాలు
ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాలపై దర్భ లేదా గడ్డిని వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. చాలా సందర్భాల్లో శాస్త్రీయంగానూ ఈ ప్రక్రియను నిరూపించారు.