APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఆకట్టుకుంటున్నాయి. ‘స్టార్ లైనర్’ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 2+1 స్లీపర్ కోచ్ తరహాలో ఉండే ఈ బస్సులో 30 బెర్తులు ఉంటాయి. ఏసీ పడని వారికి ఈ బస్సు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ బస్సులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. రీడింగ్ ల్యాంప్స్, సీసీటీవీ, ఆడియో, ఛార్జింగ్ పోర్ట్స్, ఫైర్ సేఫ్టీ అలారమ్, ప్రతి బెర్త్‌కు లగేజ్ ర్యాక్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 స్టార్ లైనర్ బస్సు సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టార్ లైన్ బస్సులను ఏయే రూట్లలో ఏ సమయాల్లో నడుపుతామో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Read Also: Baby to Speak : మీ పిల్లలకు మాటలు త్వరగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
కాగా ఏపీలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నాన్ ఏసీ స్లీపర్ బస్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులకు మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నారు.ముందుగా కొన్ని రూట్లలో బస్సులను నడిపి.. ఆదరణ పెరిగితే బస్సుల సంఖ్య మరింత పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కేవలం ప్రైవేట్ బస్సుల్లోనే నాన్ ఏసీ స్లీపర్ బెర్త్‌లు ఉండగా.. తొలిసారి ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెన్నెల పేరుతో ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులతో ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది.
APSRTC Launched Non AC Sleeper Buses with a Brand Name of STAR LINER (Sleep Travel And Relax)
🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌🚌
– 2+1 Sleeper Coach
– 30Soft Cushion Berths with Back Pad.
– Charging Ports
– Reading Lamps
– Luggage Racks for every Berth
– Audio Coach#apsrtc #starliner pic.twitter.com/yA8ayhZigO— APSRTC (@apsrtc) November 21, 2022
Read Also: Daawat Hyderabad 2022 : ఈ సారి 22వేల మందికి దావత్.. ఎక్కడంటే..!