CPI Narayana: బిగ్‌బాస్‌ను బ్యాన్ చేసే వరకు నా పోరాటం ఆగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ప్రముఖ హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘీక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను స్వీకరించలేదని నారాయణ వెల్లడించారు.
Read Also: Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
అయితే బిగ్‌బాస్ షో విషయంలో తన విన్నపాన్ని ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని సీపీఐ నేత నారాయణ తెలిపారు. ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇప్పటికే బిగ్‌బాస్ షోపై దాఖలైన పలు పిటిషన్‌లను ఏపీ హైకోర్టు విచారించిందని గుర్తుచేశారు. కాగా బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ కార్యక్రమాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా కూడా ఆయన అభివర్ణించారు. అయితే నారాయణకు హోస్ట్ నాగార్జున కూడా పలు సందర్భాలలో కౌంటర్లు వేశారు. రోహిత్-మెరీనా ముద్దు విషయంలో నారాయణ నారాయణ వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. ఇది తప్పు కాదు అంటూ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..