టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు ప్రారంభించారు.
అయితే ఇండియన్ కెప్టెన్ కోహ్లీకి ఇది రెండో మైనపు విగ్రహం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో రెండు సార్లు కోహ్లీకి ఈ అరుదైన గౌరవం దక్కిందన్న మాట. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 24న దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.