ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా రాజకీయ వేడి పులుముకుంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టగా అది రణరంగంగా మారింది. పలువురు ఆందోళనకారులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే ఈ అంశంపై మంత్రి కొడాలి నాని ఎన్టీవీతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష: డీజీపీ
టీడీపీ కార్యాలయాలపై దాడులను తాను కచ్చితంగా సమర్ధిస్తానని మంత్రి కొడాలి నాని తెలిపారు. పట్టాభి ఒక ఊరపంది అని అన్నారు. చంద్రబాబు సంగతి చూడటానికి వైసీపీ కార్యకర్తలు అవసరం లేదని… తనను ఒక్కడిని వదిలేస్తే చాలన్నారు. అయినా చంద్రబాబు, పట్టాభిని చెప్పుతో కొట్టాలని విమర్శించారు. సీఎం జగన్‌ను తిడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తాము సిద్ధంగా లేమన్నారు. చంద్రబాబు ఆఫీసులో కూర్చుని జగన్‌ను తిట్టారు కాబట్టే పార్టీ ఆఫీసును పగలకొట్టారని మంత్రి కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీ కొట్టును మూయించలేరని ఆయన ఎద్దేవా చేశారు.