ఇప్పటివరకు మనం క్రికెట్‌లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ ఒకే ఓవర్‌లో 8 సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. ఈనెల 19న సొరెంటో డన్‌క్రెయిగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే ఉడ్‌వేల్ సీనియర్ క్లబ్ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.
Read Also : భారత్ – పాక్ మ్యాచ్ పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
సాధారణంగా ఒక బ్యాట్స్‌మన్ ఒక ఓవర్‌లో గరిష్టంగా ఆరు సిక్సులు మాత్రమే కొట్టగలడు. కానీ సోరెంటో క్లబ్ క్రికెటర్ సామ్ హారిసన్ ఒకే ఓవర్లో 8 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. కింగ్ స్లే జట్టుకు చెందిన బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన ఓవర్‌లో రెండు నో బాల్స్ కూడా పడ్డాయి. దీంతో అతడు మొత్తం 8 బాల్స్ వేయాల్సి వచ్చింది. ఈ 8 బంతులకు 8 సిక్సర్లు (8*6 )అంటే 48, 2 నోబాల్స్ రూపంలో మరో 2 పరుగులు.. మొత్తం కలిపి బెన్నెట్ వేసిన ఓవర్లో 50 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో హారిసన్ 11 సిక్సర్లు, 6 ఫోర్లతో 102 పరుగులు చేయడం విశేషం.