Bomb Threat -Shamshabad Airport : ఆగని బాంబు బెదిరింపులు.. నేడు మరో రెండు విమానాలకు బెదిరింపు మెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat Triggers Alert at Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి బాంబు బెదిరింపుల కలకలం కుదిపేసింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబు హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి బయలుదేరి శంషాబాద్ చేరుకోవాల్సిన KU-373 విమానానికి బెదిరింపు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫ్లైట్‌ను మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.
READ MORE: Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!
Also Read
ఇదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277 ఫ్లైట్‌కూ ఇదే తరహా మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. పైలట్ పరిస్థితిని పర్యవేక్షించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణికులందరిని దిగదీసి అసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పూర్తిగా ఖాళీ చేసి అలర్ట్‌లో తనిఖీలు ప్రారంభించాయి. టర్మినల్ ప్రాంతంలో కూడా అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తూ అన్ని మూమెంట్స్‌ను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు సైబర్, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నా, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.
READ MORE: Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!