టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది.
Read Also: వారెవ్వా… ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు
కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో కలిసి సుప్రీంకోర్టులో అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ పిటిషన్‌పై గురువారం నాడు కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ తరఫు న్యాయవాదుల వాదనలను విని అజారుద్దీన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అపెక్స్ కౌన్సిల్‌కు ఊరట దక్కినట్లు అయ్యింది.