ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు.
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్ 120 (బి) కింద క్రైమ్ నంబర్ 352/2021 కేసును నమోదు చేశారు. కాగా అంతకుముందే పట్టాభికి విజయవాడలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
Read Also: చంద్రబాబు దీక్ష సిగ్గుచేటు: ఏపీ మంత్రి
కాగా బుధవారం రాత్రి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం నాడు పట్టాభిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో భారీ బందోబస్తు నడుమ పట్టాభిని పోలీసులు కోర్టుకు తరలించారు.