టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో పాక్‌పై టీమిండియాకు ఓటమి అన్నదే లేకపోవడంతో ఈసారి ఫలితం ఎలా వస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో తలపడే టీమిండియా డ్రీమ్ ఎలెవన్‌ను భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు.
అయితే ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు పఠాన్ చోటివ్వలేదు. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్, ఆ తర్వాత స్థానాలకు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు స్థానం కల్పించాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి చోటిచ్చాడు. పేస్ త్రయంగా భువనేశ్వర్, షమీ, బుమ్రాలు ఉండాలని పఠాన్ ఆకాంక్షించాడు. కాగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో అశ్విన్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు.