డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఆమె కొరియాకు చెందిన సీడ్‌యన్ సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీస్‌కు వెళ్లకుండా ఇంటి దారి పట్టింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె 67 నిమిషాల పాటు పోరాడగా.. ఈ పోరులో మాత్రం ఆమె 36 నిమిషాలకే చేతులెత్తేసింది.
Read Also: సూపర్-12లోకి అడుగుపెట్టిన నమీబియా
కాగా రెండేళ్ల క్రితం కొరియా ప్లేయర్ సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు సెట్లలో పీవీ సింధు ఓడిపోయింది. మళ్లీ ఇప్పడు అదే ఫలితం రిపీటయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధు.. కొంతకాలం బ్రేక్ తీసుకుని మళ్లీ డెన్మార్క్ ఓపెన్ ద్వారా బరిలోకి దిగగా.. ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.