తెలంగాణలోని పలు ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై అల్పపీడనం ఆవరించి ఉందని, దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. Read Also: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసిందెవరు? మరోవైపు […]
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం […]
టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్‌తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ […]
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలతో పాటు వంటనూనెల రేట్లు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గించింది. దీంతో దీపావళి పండగ వేళ దేశ ప్రజలకు వంట నూనెల తయారీ సంస్థలు శుభవార్త అందించాయి. అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.7 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. Read Also: ఒక సూర్యుడు, […]
తెలుగు ఓటీటీల్లో దూసుకుపోతున్న ఆహా సంస్థ 2.0 అంటూ కొత్త వెర్షన్ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. బెస్ట్ యాక్టర్ అవార్డును కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ అందుకున్నాడు. ఉత్తమ నటి అవార్డు కూడా కలర్ ఫోటో సినిమాకే వచ్చింది. ఆ మూవీ హీరోయిన్ చాందిని […]
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయాన్ని ఆయన కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామం నీలకంఠాపురంలో స్థానికులకు సేవ చేసుకుంటూ రఘువీరారెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన యాక్టివ్‌గా ఉంటారు. Read Also: రౌండ్ల వారీగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తాజాగా రఘువీరారెడ్డి ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో […]
తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో వేములవాడ ఉపఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే తమతో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు. Read Also: కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు: షర్మిల కాగా […]
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ విజయానికి గట్టి పునాది పడింది. అబుదాబీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఓపెనర్ రిజ్వాన్‌ను అంపైర్ ఎల్బీగా అవుట్ చేయగా రివ్యూ తీసుకున్న పాకిస్థాన్ విజయవంతమైంది. అనంతరం ఓపెనర్లు రిజ్వాన్ (79 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (70) తొలి వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం అందించారు. 14.2 ఓవర్ల వద్ద పాక్ […]
హైదరాబాద్ నగరానికి శివారులో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. Read Also: తెలంగాణ కరోనా అప్ డేట్ కరోనా పాజిటివ్ కేసులు పూర్థిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు ఈ టైమింగ్సే కొనసాగుతాయని రంగరాజన్ స్పష్టం చేశారు. […]
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు చెంపచెల్లుమనేలా ఓటర్లు తీర్పు ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదని.. ఉద్యమకారులని ఈ ఎన్నిక ద్వారా నిరూపించారని షర్మిల కొనియాడారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్టకథలు జనం నమ్మరని… ఇకనైనా […]