సాధారణంగా ప్రేక్షకులు ఒక సీరియల్‌ను సుదీర్ఘకాలం పాటు ఇష్టపడాలంటే బలమైన కథ ఉండాలి, మనసుని హత్తుకునే పాత్రలుండాలి. ఆ పాత్రలలో ఇమిడిపోయే నటీనటులుండాలి, ఉత్కంటగా సాగిపోయే సన్నివేశాలుండాలి. ఈ లక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకుని జీ తెలుగు మధ్యానపు సీరియళ్ల చరిత్రలోనే ఒక సంచలన ప్రయాణాన్ని సాగిస్తున్న ధారావాహిక ‘గుండమ్మ కథ’. ఈ సీరియర్ నవంబర్ 4వ తేదీ నాటికి 1000 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకోనుంది. మరోవైపు అందరూ ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్న కథనం వైపు గుండమ్మ కథ అడుగులు వేయనుంది. ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1: 30 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతోంది.
ఈ సందర్భంగా గీత పాత్ర పోషిస్తున్న పూజ మూర్తి మాట్లాడుతూ.. ‘గుండమ్మ కథ ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాం. బాహ్యశరీరాన్ని చూసి ఒకరు మరొకరిని ఎప్పుడూ కించపరుచకూడదు. వ్యక్తిత్వం చాలా అవసరం. ఎంతో మంది మనసులకు ఈ సీరియల్ నచ్చడం వల్లనే మేము ఇవాళ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు గీత జీవితంలో మరో మలుపు రాబోతుంది. ఆ మలుపులు అందరికి నచ్చుతాయని, ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ప్రేరేపితమవుతారని భావిస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు.
రామ్ పాత్ర పోషిస్తున్న కల్కి రాజా మాట్లాడుతూ… ‘గుండమ్మ కథ ఒక సీరియల్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ కూడా. ప్రతి ఒక్క పాత్ర, కథనం అందరి జీవితాలకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. గీత పాత్ర ఎంతో మంది ఆడవాళ్ళని ప్రేరేపించింది. 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్నామంటే మా గుండమ్మ కథని ఎంతోమంది ఆదరిస్తున్నారు అనడానికి అదే పెద్ద సాక్ష్యం. ఇక ముందుకూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఎల్లప్పుడూ మాతో కలిసి ప్రయాణిస్తున్న ప్రేక్షకులందరికి శతకోటి ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: వెండి తెరపై సుమ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?