ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్‌లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్‌ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా […]
హైదరాబాద్: స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని… ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు అనే బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై బుధవారం విచారించిన సిటీ సివిల్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని, వారి భరతం పడతానని ఈటల వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపు అని అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని ఈటల ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా… తనను గెలిపించిన […]
దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు […]
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్‌లో జగన్ ఆటం బాంబులు టీడీపీ ర్యాలీ సందర్భంగా […]
నిర్మల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే […]
రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా బిజినెస్ రంగంలో అయినా క్రేజ్‌ను క్యాష్ చేసుకోని వారు ఉండరు. క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వైసీపీ ఏ ఎన్నికలో పోటీ చేసినా ప్రజలు ఘనవిజయాన్ని కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ క్రేజ్‌ను పలు కంపెనీలు వాడుకుంటున్నాయి. Read Also: వైరల్ వీడియో: వ్యక్తి ప్రాణం తీసిన రోడ్డుపై గుంత దీపావళి సందర్భంగా పలు రకాల […]
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలను కబళించింది. ప్రతిరోజూ లాగే సోమవారం ఉదయం 32 ఏళ్ల మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆఫీసుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడటంతో అదుపుతప్పి బస్సు కింద మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకు రోడ్డుపై ఉన్న గుంతలో పడినప్పుడు ఎడమ వైపు […]
సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా స్టువర్టుపురం-ఈపూరుపాలెం మధ్య చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడాన్ని గమనించిన రైల్వే గస్తీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే అధికారులు స్టువర్టుపురం స్టేషన్‌లోనే నిలిపివేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 3:30 గంటల వరకు రైలు స్టువర్టుపురం స్టేషన్‌లోనే […]
దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడంతో పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం (నవంబర్ 3) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. లీటరు డీజిల్ ధర 40 పైసలు పెరిగి రూ.107.40కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61గా, లీటరు డీజిల్ ధర రూ.108.89గా […]