సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి సినిమాగా టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతోంది. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సూర్య ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘జైభీమ్’ సినిమాను వీక్షించాడు. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని లారెన్స్ కొనియాడాడు.
Read Also: డిస్నీ హాట్ స్టార్ చేతికి “అఖండ” రైట్స్
ఓ దొంగతనం కేసులో చేయని నేరానికి పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురై మృతిచెందిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటారని లారెన్స్ ముందుకొచ్చాడు. రాజా కన్ను భార్య పార్వతమ్మ (సినతల్లి)కు సొంత ఇల్లు కట్టిస్తానని లారెన్స్ హామీ ఇచ్చాడు. సినతల్లి పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని లారెన్స్ తెలిపాడు. ఆమె నిజాయితీ తనకు నచ్చిందని ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆమెకు మంచి ఇల్లు బహుమతిగా ఇస్తానన్నాడు. కాగా లారెన్స్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
A house for Rajakannu’s family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo
— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021