రాజస్థాన్ రాజకీయం… మంత్రులంతా రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం రాత్రి గవర్నర్ నివాసానికి వెళ్లారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసి క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించారు.
Read Also: గుండెలను పిండేస్తున్న బాలిక సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..?
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
రాజస్థాన్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా నూతన మంత్రుల నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం కొత్త మంత్రుల జాబితాను రాజస్థాన్ ప్రభుత్వానికి పంపనుంది. ప్రస్తుతం రాజస్థాన్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల ప్రకారం.. గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. కొత్త జాబితా వచ్చిన అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో సచిన్ పైలట్ కు స్థానం దక్కే అవకాశముంది. ఇప్పటికే నూతన కేబినెట్ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సీఎం అశోక్ గెహ్లాట్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!